అత్తా అమ్మగా మారిన రోజు
వివాహం అయిన మొదటి రోజే అరుణ జీవితంలో కొత్త అధ్యాయం మొదలైంది. భర్త సతీష్ ఎంతో ప్రేమగా చూసుకునేవాడు. కానీ అత్త మాత్రం చాలా కఠిన స్వభావం. ఇంట్లో ప్రతి పని పద్ధతిగా ఉండాలని ఆమె కోరుకునేది.
"అరుణ వంటలో ఉప్పు కాస్త ఎక్కువైంది, అని ఒకరోజు అత్త చెప్పింది.
"క్షమించండి అత్తయ్య. ఇక నుంచి జాగ్రత్తగా చేస్తాను,అని అరుణ నవ్వుతూ సమాధానం చెప్పింది.
అయినా ప్రతిరోజూ ఏదో ఒక చిన్న తప్పు కనిపెట్టేది అత్త. ఉదయం ఆలస్యంగా లేస్తే మందలింపు.కూరలో కారం తక్కువైనా మందలింపు.ఇంటిని శుభ్రం చేయడంలో చిన్న పొరపాటు జరిగినా మందలింపే.
సతీశ్ ఎన్నిసార్లు, అమ్మా.అరుణ కొత్తగా వచ్చింది. కొంచెం సమయం ఇవ్వండి,అని చెప్పినా, అత్త వినేది కాదు.
అరుణ మాత్రం ఎప్పుడూ తిరిగి మాట్లాడలేదు. అత్తను తన సొంత తల్లిలా గౌరవించింది.
ఒకరోజు అత్తకు అకస్మాత్తుగా తీవ్రమైన జ్వరం వచ్చింది.సతీష్ ఆఫీసులో ఉండటంతో ఇంట్లో అరుణ ఒక్కతే ఉంది. వెంటనే డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లి మందులు తెచ్చింది. రాత్రంతా నిద్రపోకుండా తడి గుడ్డతో నుదిటిపై ఉంచుతూ సేవ చేసింది.
మధ్యరాత్రి అత్తమ్మ కళ్లు తెరిచి చూసింది. అలసిపోయి కుర్చీలో కూర్చునే నిద్రపోతున్న అరుణ కనిపించింది.
"ఇంత ప్రేమగా నన్ను చూసుకుంటోంది. నేను మాత్రం ఈ అమ్మాయిని ఎంత బాధపెట్టానో! అని ఆమె మనసులో బాధపడింది.
ఉదయం ఆరోగ్యం కొంచెం మెరుగైంది.
"అరుణ" అని మెల్లగా పిలిచింది.
"ఏమైంది అత్తయ్య? అంటూ అరుణ వెంటనే దగ్గరకు వచ్చింది.
"నన్ను క్షమించమ్మా. నిన్ను కోడలిగా మాత్రమే చూశాను. కానీ నువ్వు నన్ను అమ్మలా చూసుకున్నావు."
అరుణ చిరునవ్వుతో, అత్తయ్య. అమ్మైనా, అత్తైనా పెద్దవాళ్లే కదా. మీ సేవ చేయడం నా బాధ్యత, అంది.
ఆ మాటలు విన్న అత్తమ్మ కళ్లలో నీళ్లు తిరిగాయి.
ఆ రోజు నుంచి ఆ ఇంటి వాతావరణం పూర్తిగా మారిపోయింది. అత్తమ్మ ఇక అరుణను "కోడలు" అని కాకుండా "అమ్మా" అని పిలవడం ప్రారంభించింది.
పండుగలప్పుడు ఇద్దరూ కలిసి వంట చేసేవారు. బట్టలు కొనడానికి ఇద్దరూ కలిసి వెళ్లేవారు. పక్కింటి వాళ్లు కూడా, ఇవాళ్టి కాలంలో ఇంత మంచి అత్తా కోడలు అనుబంధం చూడటం అరుదు, అని ఆశ్చర్యపడేవారు.
కొన్ని నెలల తర్వాత అరుణకు పాప పుట్టింది. ఆ చిన్నారిని చేతిలోకి తీసుకున్న అత్తమ్మ ఆనందంతో, నా కూతురికి పాప పుట్టింది,అని అందరికీ చెప్పింది.
అప్పుడు అరుణ నవ్వుతూ, అత్తయ్య. ఇప్పటికైనా నేను మీ కోడలినేనా? అని అడిగింది.
అత్తమ్మ ఆమె తల నిమిరుతూ, లేదు అమ్మా. నువ్వు నా కోడలు కాదు. నాకు పుట్టని కూతురు,అంది.
ఆ మాట విన్న అరుణ కళ్లలో ఆనందబాష్పాలు మెరిశాయి. ఇద్దరూ ఒకరినొకరు హత్తుకున్నారు.
ఆ రోజు నుంచి ఆ ఇంట్లో బంధం పేరు అత్తా కోడలు కాదు.అమ్మా కూతుళ్లు.
ప్రేమ, ఓర్పు, గౌరవం ఉన్న చోట బంధాలు రక్తసంబంధాల కంటే గొప్పవిగా మారతాయి.ఎవ్వరు తప్పుగా అనుకోవద్దు. ఓన్లీ ఎంటెన్మెంట్ కోసమే రాసాను. మీ అభిప్రాయం కింద కామెంట్స్ ద్వారా చెప్పండి.ఈ కథా మీకు నచ్చితే పేజీని పాలో చేయండి
#TeluguLoveStory
#LoveStoriesTelugu
#Premakatha
#TeluguRomance
#FeelGoodStories
Comments
Post a Comment