రాత్రి రచ్చ సీజన్ 2

 భార్యాభర్తల ప్రేమను పరీక్షించేది పెద్ద సమస్యలు కాదు.చిన్న చిన్న అపార్థాలే.

ఆ రోజు రాత్రి బయట నుంచి భోజనం చేసి ఇంటికి వచ్చిన సుజాత, ప్రసాద్ ఇద్దరూ చాలా సంతోషంగా ఉన్నారు.

మరుసటి ఉదయం.

సుజాత వంట చేస్తుండగా ప్రసాద్ ఫోన్‌కి వరుసగా మెసేజ్‌లు వచ్చాయి.

"టింగ్. టింగ్.టింగ్ ఎవరు అంత పొద్దున్నే మెసేజ్‌లు చేస్తున్నారు? అని సరదాగా అడిగింది సుజాత.

ఆఫీస్ గ్రూప్ అయి ఉంటుంది,అంటూ ప్రసాద్ ఫోన్‌ను టేబుల్ మీద పెట్టి స్నానం చేయడానికి వెళ్లాడు.

అంతలో మరో మెసేజ్ వచ్చింది.

"నిన్న ఇచ్చిన సర్‌ప్రైజ్‌కి థ్యాంక్యూ."

ఆ ఒక్క మెసేజ్ చూసి సుజాత ముఖంలో చిరునవ్వు మాయమైంది.

"సర్‌ప్రైజ్. ఎవరికిచ్చాడు?

ప్రసాద్ బయటకు వచ్చేసరికి సుజాత మౌనంగా ఉంది.ఏమైంది?

ఏమీ లేదు."నీ 'ఏమీ లేదు' అంటే ఏదో ఉంది.సుజాత ఫోన్ చూపించింది.

ప్రసాద్ చూసి ఒక్కసారిగా నవ్వేశాడు.

"ఇందులో నవ్వేంటి?

"ఇది నా చెల్లెలి మెసేజ్. రేపు ఆమె పుట్టినరోజు. నిన్న ఆమెకు ముందుగానే చిన్న గిఫ్ట్ ఇచ్చాను. నీకు కూడా సర్‌ప్రైజ్ చేయాలనుకున్నాను."

అని వెంటనే చెల్లెలితో చేసిన చాట్ మొత్తం చూపించాడు.సుజాతకు సిగ్గేసింది.

"సారీ. మళ్లీ తొందరపడ్డాను.

ప్రసాద్ చిరునవ్వుతో అన్నాడు.

"మన మధ్య అనుమానాలు రావచ్చు కానీ నిజం తెలుసుకునే వరకు తీర్పు చెప్పకూడదు.సుజాత తల ఊపింది.

ఇక నుంచి నీ ఫోన్ కాదు. నీ మనసే చదువుతాను.ప్రసాద్ నవ్వుతూ,

అది చదవడానికి జీవితాంతం కూడా సరిపోదు.ఇద్దరూ నవ్వుకుంటూ కాఫీ తాగారు.అప్పుడే కరెంట్ పోయింది.

"ఫ్యాన్ లేదు. ఏసీ లేదు. అంటూ సుజాత చిరాకుపడింది.

ప్రసాద్ వెంటనే రెండు కప్పుల టీ తీసుకుని డాబాపైకి వెళ్లాడు.

చల్లని గాలి వీచుతోంది.

"చూశావా. కరెంట్ పోయినా, మన ఇద్దరం కలిసి ఉంటే ఈ రాత్రి కూడా అందంగానే ఉంటుంది.

సుజాత అతని భుజంపై తల ఆనిస్తూ,

"నిజమే. ఇల్లు వెలుగుతో కాదు. మనసులు కలిసుంటేనే వెలుగుతుంది."

ఆకాశంలో నక్షత్రాలు మెరుస్తుంటే, వారి కళ్లలో ప్రేమ మరింత మెరిసింది.

"ప్రతి రాత్రి రచ్చతో ముగిసినా. చివరికి ప్రేమ గెలిచే ఇల్లు ఎప్పుడూ సంతోషంగానే ఉంటుంది.కొనసాగుతుంది.ఎవ్వరు తప్పుగా అనుకోవద్దు. ఓన్లీ ఎంటెన్మెంట్ కోసమే రాసాను. మీ అభిప్రాయం కింద కామెంట్స్ ద్వారా చెప్పండి.ఈ కథా మీకు నచ్చితే పేజీని పాలో చేయండి ఫ్రెండ్స్.మళ్ళీ నెక్స్ట్ పార్ట్ లో కలుద్దాం.

Comments

Popular posts from this blog

హల్ లోకి వచ్చి టీవీ పెట్టుకొని కూర్చున్న

ముందే చెప్పాను కదా సుస్మిత

బావ నా జీవిత భాగస్వామి పార్ట్ 2