మరదలి మనసు పార్ట్ 2

 మరదలి మనసు పార్ట్ 2


దూరం ఇళ్ల మధ్యే ఉంటుంది. మనసుల మధ్య కాదు.

నందిని పెళ్లై కొత్త ఇంటికి వెళ్లి నెల రోజులు అయింది. కానీ ప్రతి ఉదయం అరుణ ఫోన్ మోగేది.అక్కా. టిఫిన్ చేశావా?

అక్కా. ఈ రోజు ఏమి వండావు?

ఆ చిన్న చిన్న మాటలు అరుణ ముఖంలో చిరునవ్వు తెచ్చేవి.

ఒక రోజు నందిని గొంతు చాలా నీరసంగా వినిపించింది.ఏమైంది నందు? అని అరుణ ఆందోళనగా అడిగింది.ఏమీ లేదు అక్కా కొత్త ఇల్లు కదా. అందరితో కలిసిపోవడానికి కొంచెం సమయం పడుతోంది,అని చెప్పినా, ఆమె మాటల్లో బాధ స్పష్టంగా కనిపించింది.

అది విన్న అరుణ వెంటనే భర్తతో కలిసి నందిని ఇంటికి వెళ్లింది.

అరుణను చూసిన నందిని పరుగెత్తుకుంటూ వచ్చి హత్తుకుంది.

నువ్వు వస్తావని అనుకోలేదు అక్కా.

అరుణ ఆమె తల నిమురుతూ చెప్పింది.

నువ్వు పిలవకపోయినా నీ కళ్లలోని బాధ నన్ను పిలిచింది.

ఆ మాట విని అక్కడున్న వారంతా నిశ్శబ్దంగా చూశారు.

అరుణ నందిని అత్తమామలతో ఎంతో ఆప్యాయంగా మాట్లాడింది.

కొత్త ఇంటికి వచ్చిన అమ్మాయికి ప్రేమ, ఓర్పు, అండ చాలా అవసరం. కొంత సమయం ఇస్తే తనే ఈ ఇంటి కూతురిలా మారిపోతుంది, అని మృదువుగా చెప్పింది.

ఆ మాటలు వాళ్ల మనసులను తాకాయి.

కొన్ని రోజుల్లోనే నందిని అందరితో కలిసిపోయింది. ఇంట్లో నవ్వులు మళ్లీ వినిపించాయి.ఒక సాయంత్రం నందిని అరుణకు ఫోన్ చేసింది.

అక్కా.నువ్వు నాకు వదినవు కాదు. నాకు అమ్మ తర్వాత అమ్మవు.

అరుణ కళ్లలో ఆనందబాష్పాలు మెరిశాయి.నీ సంతోషమే నాకు పెద్ద బహుమతి నందు,అని చెప్పింది.

ప్రేమ అనేది మాటల్లో కాదు. అవసరమైన సమయంలో మనిషి పక్కన నిలబడటంలో ఉంటుంది. అదే నిజమైన బంధం.ఎవ్వరు తప్పుగా అనుకోవద్దు. ఓన్లీ ఎంటెన్మెంట్ కోసమే రాసాను. మీ అభిప్రాయం కింద కామెంట్స్ ద్వారా చెప్పండి.

Comments

Popular posts from this blog

హల్ లోకి వచ్చి టీవీ పెట్టుకొని కూర్చున్న

ముందే చెప్పాను కదా సుస్మిత

బావ నా జీవిత భాగస్వామి పార్ట్ 2