మా విడాకులు
కొన్ని ప్రేమలు కలిసి ఉన్నప్పుడు కాదు. దూరమైన తర్వాత వాటి విలువ తెలుస్తుంది.విడాకులు జరిగి ఆరు నెలలు గడిచిపోయింది.ప్రసాద్ జీవితంలో డబ్బు ఉంది.ఉద్యోగం ఉంది కానీ ప్రశాంతంగా నిద్రపోయే ఒక్క రాత్రి కూడా లేదు.
ప్రతి ఉదయం నందిని కాఫీ ఇచ్చే కప్పు గుర్తొచ్చేది.ప్రతి రాత్రి ఆమె చెప్పే "జాగ్రత్తగా ఉండు" అనే మాట చెవుల్లో మార్మోగేది.
మరోవైపు శ్రుతి కూడా బయటకు నవ్వుతూ కనిపించినా. లోపల మాత్రం ప్రతిరోజూ విరిగిపోతూనే ఉంది.ఒకరోజు అనుకోకుండా ఇద్దరూ ఒక చిన్న అనాథాశ్రమంలో ఎదురుపడ్డారు.
ప్రసాద్ అక్కడ పిల్లలకు భోజనం పెట్టడానికి వచ్చాడు.శ్రుతి అదే ఆశ్రమంలో పిల్లలకు పాఠాలు చెబుతోంది.ఇద్దరి కళ్లూ ఒక్కసారిగా కలిశాయి.మాటలు లేవు.
కానీ మౌనం చాలా చెప్పింది.
ఒక చిన్న పాప పరుగెత్తుకుంటూ వచ్చి.
అంకుల్. ఆంటీ.మీరు ఇద్దరూ భార్యాభర్తలా కనిపిస్తున్నారు,అని అమాయకంగా అడిగింది.ఇద్దరూ ఒకరినొకరు చూసుకుని చిన్నగా నవ్వారు.ఆ నవ్వు వెనుక దాచుకున్న బాధ మాత్రం కనిపించకుండా పోలేదు.కొద్దిసేపటి తర్వాత ప్రసాద్ ధైర్యం చేసి అడిగాడు.శ్రుతి ఎలా ఉన్నావు?"
ఆమె చిరునవ్వు నవ్వి.బాగానే ఉన్నాను. కానీ సంతోషంగా లేను,అంది.
ఆ ఒక్క మాట ప్రసాద్ గుండెను కదిలించింది.నేనూ అంతే. అని మెల్లగా అన్నాడు.ఇద్దరూ ఆశ్రమం బయట బెంచ్ మీద కూర్చున్నారు.చాలా రోజుల తర్వాత మొదటిసారి ప్రశాంతంగా మాట్లాడుకున్నారు.మనిద్దరం విడిపోయింది ప్రేమ లేక కాదు. మాట్లాడుకోవడం మానేయడం వల్ల,అంది శ్రుతీ.ప్రసాద్ తల వంచి.
నువ్వు నా చేతిని వదల్లేదు. నేను నీ మనసును వదిలేశాను. అదే నా పెద్ద తప్పు,అన్నాడు.శ్రుతి కళ్లలో నీళ్లు తిరిగాయి.ఈ మాటలు ఆ రోజు చెప్పి ఉంటే. మన జీవితం ఇలా ఉండేది కాదు.
అప్పుడే ఆశ్రమంలోని చిన్న పిల్లలు ఇద్దరి దగ్గరకు వచ్చి.అన్నయ్యా. అక్కా. మీరు నవ్వితే చాలా బాగుంటారు. ఎప్పుడూ ఇలా నవ్వుతూ ఉండండి, అన్నారు.
ఆ అమాయక మాటలు ఇద్దరి హృదయాలను కరిగించాయి.
ప్రసాద్ మెల్లగా అడిగాడు.
నన్ను క్షమించగలవా?
శ్రుతి కాసేపు మౌనంగా ఉండి.
క్షమించడం చాలా రోజుల క్రితమే నేర్చుకున్నాను. కానీ మళ్లీ నమ్మడానికి కొంచెం సమయం కావాలి,అంది.
ప్రసాద్ చిరునవ్వుతో.
ఈసారి ప్రేమను మాటలతో కాదు నా మార్పుతో నిరూపిస్తాను,అన్నాడు.
ఆ రోజు వాళ్లు భార్యాభర్తలుగా కాదు.
మళ్లీ ఒకరినొకరు అర్థం చేసుకోవాలనుకునే ఇద్దరు మనుషులుగా విడిపోయారు.
ఎందుకంటే.విడాకులు ఒక బంధాన్ని ముగించవచ్చు. కానీ నిజంగా మారిన ఇద్దరు మనసులు కొత్తగా జీవితాన్ని ప్రారంభించడానికి తలుపులు ఎప్పుడూ మూసివేయవు.కొనసాగుతుంది.ఎవ్వరు తప్పుగా అనుకోవద్దు. ఓన్లీ ఎంటెన్మెంట్ కోసమే రాసాను. మీ అభిప్రాయం కింద కామెంట్స్ ద్వారా చెప్పండి.ఈ కథా మీకు నచ్చితే పేజీని పాలో చేయండి ఫ్రెండ్స్.మళ్ళీ నెక్స్ట్ పార్ట్ లో కలుద్దాం.
Comments
Post a Comment