మరదలి మనసు

 మరదలి మనసు


కొన్ని బంధాలకు ప్రేమ అనే పేరు ఉండదు. కానీ ఆప్యాయత మాత్రం జీవితాంతం గుర్తుండిపోతుంది."

ఒక మంచి బావ, ఒక మంచి మరదలికి అన్నయ్యలా అండగా ఉంటే. ఆ బంధం మొత్తం కుటుంబాన్ని ఒక్కటిగా నిలబెడుతుంది.

కొత్తగా పెళ్లై అరుణ అత్తింటికి వచ్చింది. అందరూ ఆమెను ప్రేమగా చూసినా, ఆమెకు కొత్త ఇల్లు, కొత్త మనుషులు కాబట్టి కొంచెం భయం ఉండేది. ఆ ఇంట్లో ఆమె భర్తతో పాటు అతని చెల్లెలు నందిని కూడా ఉండేది.మొదటి రోజు నుంచే నందిని అరుణను "వదినా" అని కాకుండా, అక్కా" అని పిలిచేది.నాకు ఒక అక్క కావాలని చిన్నప్పటి నుంచే కోరిక. ఇప్పుడు దేవుడు నిన్ను పంపించాడు,అని నవ్వుతూ చెప్పింది.ఆ మాట విన్న అరుణ కళ్లలో ఆనందం మెరిసింది.

ఒక రోజు ఇంట్లో చిన్న అపార్థం జరిగింది. అరుణ చేసిన పనిని ఎవరో తప్పుగా అర్థం చేసుకున్నారు. అందరూ మౌనంగా ఉండగా, నందిని ముందుకు వచ్చింది.

వదిన ఎప్పుడూ ఇలా చేయరు. ముందు నిజం తెలుసుకుందాం,అని ధైర్యంగా చెప్పింది.తర్వాత నిజం బయటపడింది. అరుణ ఏ తప్పూ చేయలేదని తెలిసింది.

ఆ రోజు అరుణ నందిని దగ్గరకు వెళ్లి అడిగింది.నన్ను అంతగా ఎందుకు నమ్మావు?నందిని చిరునవ్వుతో.

మన ఇంట్లోకి అడుగుపెట్టిన రోజు నుంచే నువ్వు పరాయిదానివి కాదు. మా కుటుంబంలో ఒకరివి. మన వాళ్లను నమ్మకపోతే ఇంకెవరిని నమ్మాలి? అంది.

ఆ మాటలు అరుణ మనసును తాకాయి.

రోజులు గడిచాయి. ఇద్దరూ కలిసి వంట చేయడం, షాపింగ్‌కు వెళ్లడం, చిన్న చిన్న రహస్యాలు పంచుకోవడం. అలా వదిన,మరదలు కాదు, నిజమైన అక్కాచెల్లెళ్లలా మారిపోయారు.

ఒక రోజు నందిని పెళ్లి నిశ్చయమైంది.

పెళ్లి రోజు దగ్గరపడుతుండగా అరుణ కళ్లలో నీళ్లు కనిపించాయి.

ఏమైంది అక్కా? అని నందిని అడిగింది.

నువ్వు ఈ ఇంట్లో లేకపోతే చాలా వెలితిగా ఉంటుంది,అంది అరుణ.

నందిని అరుణ చేతులు పట్టుకుని నవ్వింది.ఇల్లు మారుతుందే కానీ.మన బంధం మారదు. నువ్వు ఎప్పటికీ నా అక్కవే.ఆ రోజు ఇద్దరూ ఒకరినొకరు హత్తుకుని ఏడ్చారు. అది బాధతో కాదు. ఒక అందమైన అనుబంధానికి గుర్తుగా.

కొన్ని బంధాలు రక్తసంబంధాలు కాకపోయినా.మనసుతో కలిస్తే జీవితాంతం నిలిచిపోతాయి. అదే 'మరదలి మనసు'ఎవ్వరు తప్పుగా అనుకోవద్దు. ఓన్లీ ఎంటెన్మెంట్ కోసమే రాసాను. మీ అభిప్రాయం కింద కామెంట్స్ ద్వారా చెప్పండి.ఈ కథా మీకు నచ్చితే పేజీని పాలో చేయండి ఫ్రెండ్స్.మళ్ళీ నెక్స్ట్ పార్ట్ లో కలుద్దాం.


#telugukathalu 

Comments

Popular posts from this blog

హల్ లోకి వచ్చి టీవీ పెట్టుకొని కూర్చున్న

ముందే చెప్పాను కదా సుస్మిత

బావ నా జీవిత భాగస్వామి పార్ట్ 2